ఆటో డ్రైవర్లకు పోలీసుల కౌన్సిలింగ్

ఆటో డ్రైవర్లకు పోలీసుల కౌన్సిలింగ్

కృష్ణా: పమిడిముక్కల మండలం వీరంకిలాకుల సెంటర్ లో ఓవర్ లోడ్ తో వెళుతున్న ఆటో డ్రైవర్లకు ఎస్ఐ శ్రీను కౌన్సిలింగ్ నిర్వహించారు. ఓవర్ లోడ్ తో వెళ్లడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రైవర్లు విధిగా డ్రస్ కోడ్ పాటించాలన్నారు.