శామీర్‌పేట్ ఓఆర్ఆర్‌పై అగ్ని ప్రమాదం

శామీర్‌పేట్ ఓఆర్ఆర్‌పై అగ్ని ప్రమాదం

HYD: శామీర్‌పేట్ ఓఆర్ఆర్ (ORR)పై ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లియోనియో రెస్టారెంట్ వద్ద వెళ్తున్న ఎకోస్పోర్ట్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో డ్రైవర్ బయటకు రాలేక సజీవదహనం అయ్యాడు. శామీర్‌పేట్ నుంచి కీసరకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి  వివరాలు తెలియాల్సి ఉంది.