నాలుగు నెలలుగా వేతనాలు అందక.. జీవితం సాగక

నాలుగు నెలలుగా వేతనాలు అందక.. జీవితం సాగక

SRPT: జిల్లాలో ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టులు అప్పగించే విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. చిరు ఉద్యోగులకు వేతనాలు అందక నాలుగు నెలలు గడుస్తున్నా కనీస పట్టింపు లేకుండా పోయిందని వాపోతున్నారు. దీంతో జిల్లాలోని వివిధ డిపార్టుమెంట్లలో పనిచేస్తున్న సుమారు 1500ల మంది వేతనాల కోసం ఎదరు చూస్తూ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నట్లు పేర్కొన్నారు.