ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో అర్థమెటిక్ శిక్షణ ప్రారంభం

ఉట్నూర్ డిగ్రీ కళాశాలలో అర్థమెటిక్ శిక్షణ ప్రారంభం

ADB: ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం మూడు రోజుల అర్థమెటిక్, రీజనింగ్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. బ్యాంకింగ్, ఎస్ఎస్సీ వంటి పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఈ నైపుణ్యాలు ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు ఈ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.