'సేంద్రీయ ఎరువులు ఎక్కువగా వాడాలి’

'సేంద్రీయ ఎరువులు ఎక్కువగా వాడాలి’

KDP: ముద్దనూరు మండలంలోని రైతులు తమ భూముల్లో సేంద్రీయ ఎరువుల వినియోగం పెంచాలని వ్యవసాయ శాఖ ఏడీ రామ్మోహన్ రెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక రైతు సేవా కేంద్రంలో భూమాత పరిరక్షణపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరువుల అధిక వినియోగం భవిష్యత్తు తరాలకు భూముల ఉత్పాదకతను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు.