నరసాపురం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్
WG: నరసాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను టీడీపీ నరసాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు, మత్స్య కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు సమస్యలు విని అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తామని రామరాజు తెలిపారు.