రేపటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు
PDPL: ఓదెల మండలంలోని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం రేపటి (బుధవారం) నుంచి ప్రారంభమవుతుందని MPDO అనిల్ రెడ్డి తెలిపారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం, ఐకేపీ మీటింగ్ హాల్లో ఈ శిక్షణ జరుగుతుంది. గ్రామ పంచాయతీ విధులు, నియమ నిబంధనలు, అభివృద్ధి కార్యక్రమాలపై టీఓటీలు ద్వారా అవగాహన కల్పించనున్నారు. వార్డు సభ్యులు హాజరు కావాలన్నారు.