జిల్లాలో వర్షపాతం వివరాలు

WGL: జిల్లాలో శనివారం ఉదయం 8:30 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సగటు వర్షపాతం 2.0 మి.మీ నమోదైంది. ఖానాపూర్ మండలంలో అత్యధికంగా 15.0 మి.మీ వర్షం పడింది. వరంగల్ పట్టణంలో 5.3 మి.మీ, గీసుగొండలో 3.5 మి.మీ, సంగెంలో 1.5 మి.మీల వాన కురిసింది. ఖిల్లా వరంగల్, చెన్నారావుపేట మండలాల్లో 0.5 మి.మీ చొప్పున వర్షం కురవగా కొన్ని మండలాల్లో అసలు వర్షమే లేదు.