ఆ కాలిన మృతదేహం ఎవరిదీ..?

ప్రకాశం: దొనకొండ మండలం గంగదేవిపల్లి గ్రామ సమీపంలోని వాగులో నిన్న ఓ మహిళ మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ హసన్, దొనకొండ ఎస్ఐ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి.. రెండు రోజుల క్రితమే పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. పూర్తిగా కాలిపోయి, శరీర భాగాలు విడిపోయి ఉండటంతో ఆనవాళ్లు గుర్తించడం కష్టంగా ఉంది.