పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయ దంపతుల విరాళం

పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయ దంపతుల విరాళం

ప్రకాశం: పెద్దచెర్లోపల్లి మండలం వెంగలాయపల్లి, దివాకరపురం పాఠశాలల అభివృద్ధి కోసం ప్రధానోపాధ్యాయులు స్వర్ణ వెంకట రమణయ్య, అరుణ దంపతులు తమ సొంత నిధుల నుంచి రూ.1.50 లక్షలు విరాళంగా అందించారు. మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ సుబ్బారెడ్డికి చెక్ రూపంలో అందజేశారు. వారి సేవలను అధికారులు అభినందించారు.