సాగునీటి ప్రాజెక్టులకు రూ.300 కోట్ల నిధులు
AP: అనంతపురం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. 2025-26 బడ్జెట్‌లో రూ.300 కోట్లు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.