కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ వృద్ధ దంపతులు
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ 5వ వార్డు రిక్షా కాలనీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందులను వృద్ధ దంపతులు ఎర్రబెల్లి దయాకర్ రావుకు మొరపెట్టుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మా బతుకులు బాగుండేనని, ఎన్నికల ముందు రూ.4000 పెన్షన్ ఇస్తానని చెప్పి రూ.2000 ఇస్తున్నారని మండిపడ్డారు.