కాంగ్రెస్‌లోకి ముగ్గురు కౌన్సిలర్లు
MDK: మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు సంద్య నవీన్ (13వ వార్డు), గౌస్ ఖురేషి (22వ వార్డు), శృతి సంతోష్ (23వ వార్డు) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే రోహిత్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై చేరినట్లు తెెలిపారు.