'శాశ్వత ప్రాతిపదికన డాక్టర్లను నియమించాలి'

E.G: నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న డాక్టర్లు కొరత తీర్చాలని CPM నాయకులు జువ్వల రాంబాబు మంత్రి కందుల దుర్గేష్‌ను కోరారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో మాట్లాడి డాక్టర్ల నియామకం జరిగేలా ప్రయత్నించారు. అయితే డిప్యూటేషన్‌పై డాక్టర్లు నియామకం జరిగినా త్వరలో శాశ్వత ప్రాతిపదికన డాక్టర్లను నియమించాలని జువ్వల రాంబాబు కోరారు.