VIDEO: జిల్లాలో పంట నష్టం వివరాలను సేకరించండి: కలెక్టర్
NGKL: తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందనే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే సేకరించి సమర్పించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. బుధవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.