'పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి'

'పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి'

SRPT: పశుపోషకులు నిర్లక్ష్యం చేయకుండా తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని జిల్లా పశు వైద్య సహాయ సంచాలకుడు డాక్టర్ వెంకన్న కోరారు. శనివారం తుంగతుర్తిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. ఈ వ్యాధి సోకితే పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.