కంచల ఏటూరు మేజర్ కాలువలకు నీటి విడుదల

కంచల ఏటూరు మేజర్ కాలువలకు నీటి విడుదల

NTR: జగ్గయ్యపేట మండలం గౌరవరం హెడ్ రెగ్యులేటర్ నుంచి కంచల ఏటూరు మేజర్ కాలువలకు సోమవారం నీటి విడుదల చేశారు. ఈ జలహారతిలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే రాజగోపాల్ పాల్గొన్నారు. ఈ నీటి విడుదలతో రైతులకు సాగునీరు అందుతుందని, వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుందని నేతలు తెలిపారు.