ప్రజా సమస్యల వేదికలో ఫిర్యాదుల స్వీకరణ

ప్రజా సమస్యల వేదికలో ఫిర్యాదుల స్వీకరణ

తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ ఆర్జిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు వివరించగా, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.