'పొలాల్లో మినుము పెసర విత్తనాలు జల్లుకోవాలి'

'పొలాల్లో మినుము పెసర విత్తనాలు జల్లుకోవాలి'

AKP: వరి కోతలు కోసే రెండు మూడు రోజులు ముందు పెసర, మినుము విత్తనాలు జల్లు కోవాలని పాయకరావుపేట ఏవో ఆదినారాయణ సూచించారు. మంగళవారం సత్యవరంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. మినుములు ఎకరానికి 12 కిలోలు, పెసలు 8 నుంచి 10 కిలోలు జల్లు కోవాలని తెలిపారు. రబీలో పంటల సాగు చేస్తున్న రైతులు పంటల భీమా చేయించుకోవాలని సూచించారు.