రేపు సైక్లింగ్ పోటీలు

రేపు సైక్లింగ్ పోటీలు

నిజామాబాద్: ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నగరంలోని కంఠేశ్వర్ బైపాస్‌లో ఈనెల 3న ఉదయం 7 గంటలకు ఉమ్మడి జిల్లా అండర్-17 బాలబాలికల సైక్లింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 9347216426 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.