VIDEO: వర్షం కురిస్తే జలమయం అవుతున్న జాతీయ రహదారి

VIDEO: వర్షం కురిస్తే జలమయం అవుతున్న జాతీయ రహదారి

NLG: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రతి చిన్న వర్షానికే రహదారి పూర్తిగా నీటిలో మునిగిపోతోంది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. ఈ వర్షపు నీరు దుకాణాలు, ఇళ్లలోకి ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.