పనులను నాణ్యత ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలి
SRPT: హుజూర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 2,160 ఇందిరమ్మ ఇళ్లను త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలియజేశారు. గురువారం ఆయన ఈ కాలనీలో పర్యటించి విద్యుత్, తాగునీరు, గ్రీనరీ పనులను పరిశీలించారు. పనులను నాణ్యత ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.