PHCలో జరుగుతున్న పనులు పరిశీలించిన DMHO
HNK: శాయంపేట మండల కేంద్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న మరమ్మతు పనులను DMHO డా. అప్పయ్య శుక్రవారం పరిశీలించారు. PHCలో పైకప్పు నుంచి నీటి లీకేజ్, పెచ్చులు ఊడడం, డ్రైనేజ్, ఇతర అత్యవసర పనుల గురించి ఇటీవల జిల్లా కలెక్టర్‌కి అధికారులు విన్నవించారు. కలెక్టర్ వెంటనే మరమ్మతు పనుల కోసం రూ.10 లక్షలు మంజూరు చేయించగా పనులు కొనసాగుతున్నాయన్నారు.