అచ్చంపేట సీపీఎం మండల కార్యదర్శిగా సైదులు

NGKL: అచ్చంపేటలో జరిగిన తాలూకా స్థాయి సీపీఐ ఎం కార్యకర్తల సమావేశంలో శుక్రవారం వర్ధన్ సైదులను మండల కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు సీపీఎం జిల్లా నాయకులు తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ.. పార్టీ కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన కార్యదర్శి వర్గం సైదులు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.