'ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలి'

'ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలి'

ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ హరిత తెలిపారు. బుధవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఆసుపత్రి సామర్థ్యాన్ని 330 పడకలకు పెంచినట్లు తెలిపారు. సిబ్బంది నియామకం, పరికరాల సమకూర్పు జరుగుతోందన్నారు. ఆరోగ్యశ్రీ నిధులను మందులు, ఆక్సిజన్ కోసం వినియోగించాలన్నారు.