హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే

హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే

వనపర్తి నియోజకవర్గ ప్రయోజనాలను గత పాలకులు విస్మరించారని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వనపర్తి ప్రజలకు జరిగిన అన్యాయంపై మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్ నిర్మించి, వనపర్తి వాటాకు గండి కొట్టారని ఆయన విమర్శించారు.