ఈ నెల 15న పొలతల క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణం
KDP: ప్రసిద్ధ శివ క్షేత్రం పొలతల క్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 15వ తేదీన శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు, ఆలయ ఛైర్మన్ రాజారెడ్డి శనివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కళ్యాణానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.