రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.
శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం సిలగం సింగివలస గ్రామానికి చెందిన రాంబాబు (48) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం మన్నయుపేట వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. రాంబాబు టైలరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఆయన మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.