'గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

ప్రకాశం: పామూరు సర్కిల్ పరిధిలో ఈనెల 27న వినాయక చవితి పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సీఐ భీమా నాయక్ కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి పండగకు సంబంధించి విగ్రహాలు పెట్టుకునేందుకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో గణేష్ యాప్‌ను రూపొందించారని, ఆ యాప్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క వినాయక మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.