ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

MHBD: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 10వార్డు వీరారంతండాలో నేడు స్ట్రీట్ కాజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ. 4.50 లక్షల ఖర్చుతో నూతన ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ ప్లాంటును స్వచ్ఛంద సంస్థ సభ్యులు కటికనేని నిహల్ కృష్ణ ప్రారంభించారు. ఈ మేరకు తండావాసులు నేహాలు కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.