'పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

SRPT: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ వేణారెడ్డిలు అన్నారు. గురువారం చివ్వెంల మండలం తుల్జారావుపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి, రేషన్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న రూ.5లక్షల ఆర్థిక సాయం పొందాలన్నారు.