డిస్ట్రిబ్యూటరీ ఛానల్ నిర్మాణ నిధుల కోసం వినతి

డిస్ట్రిబ్యూటరీ ఛానల్ నిర్మాణ నిధుల కోసం వినతి

నెల్లూరు: క్రాకుటూరు రెగ్యులేటర్ వద్ద డిస్ట్రిబ్యూటరీ ఛానల్ నిర్మాణానికి రూ.8.50 కోట్లు మంజూరు చేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ అసెంబ్లీలో మాట్లాడారు. సోమశిల నుంచి ఉదయగిరి మీదుగా కందుకూరు వరకు జీకేఎన్ కాలువ అభివృద్ధి పనులను వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం 700 క్యూసెక్కుల నుంచి 1400 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా చర్యలు చేపట్టామన్నారు.