కళాకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే
E.G: కళాకారుల సంక్షేమానికి కృషి చేస్తానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ప్రభు గారి తోటలో జరిగిన కళాకారుల ఆత్మీయ కలయికలో పాల్గొని మాట్లాడారు. తమ సమస్యలు, అవసరాలను వినతిపత్రంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్‌కు అందించాలని సూచించారు. జిల్లాకు చెందిన మంత్రే కావడంతో వారి సమస్యలను త్వరగా పరిష్కారిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.