'జైశంకర్ లెటర్ ఫేక్'.. నమ్మొద్దని MEA క్లారిటీ
విదేశాంగ మంత్రి జైశంకర్ రఫెల్ డీల్ గురించి ఫ్రాన్స్ కు లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ఓ లెటర్ వైరల్ అవుతోంది. అయితే అది పూర్తిగా 'ఫేక్' అని విదేశాంగ శాఖ(MEA) స్పష్టం చేసింది. రఫెల్ డెలివరీ సమాచారం లీక్ అయ్యిందన్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. 'డిస్కోర్స్ ల్యాబ్' అనే అకౌంట్ దీన్ని సృష్టించిందని, ఇలాంటి అసత్యాలను నమ్మొద్దని హెచ్చరించింది.