‘టీడీపీ సభ్యత్వం కుటుంబానికి రక్షణ కవచం లాంటిది’

SS: టీడీపీ సభ్యత్వం అంటే ఒక కుటుంబానికి రక్షణ కవచం లాంటిదని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఇటీవల వివిధ కారణాలతో ప్రమాదవశాత్తు మరణించిన ముగ్గురు కార్యకర్తల కుటుంబాలకు ఎమ్మెల్యే సునీత ఆర్థిక సాయం అందించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి పార్టీ సభ్యత్వం ఉండటంతో రూ. 5 లక్షల బీమా మంజూరు అయినట్లు పార్టీ నుంచి మంజూరు పత్రాలు వచ్చాయన్నారు.