ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్
ASF: బెందారలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ కె.హరిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటించి, వారి విద్యా సామర్థ్యాలను స్వయంగా పరీక్షించారు. అనంతరం పాఠశాలలోని వసతులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.