స్టార్‌లింక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధర ఎంతంటే?

స్టార్‌లింక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధర ఎంతంటే?

ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ భారత్‌లో కమర్షియల్ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరను వెల్లడించింది. ఈ సేవలు పొందాలంటే రెసిడెన్షియల్ కస్టమర్లు నెలకు రూ.8,600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత డేటా లభిస్తుందని స్టార్‌లింక్ పేర్కొంది. 30 రోజులపాటు ఫ్రీ ట్రయల్‌ను ఆస్వాదించొచ్చని పేర్కొంది.