VIDEO: 'నిందితుడుకి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి'
PLD: శ్రీకాకుళంలో ఇంటర్ చదువుతున్న గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడిన సివిల్ ఇంజనీర్ వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం చిలకలూరిపేట సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. చదువు చెబుతానని నమ్మించి విశాఖలో బాలికపై నిందితుడు దారుణానికి ఒడిగట్టాడని, అతనికి ఉరిశిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.