భారత్-సౌదీ మధ్య ద్వైపాక్షిక హజ్ ఒప్పందం

భారత్-సౌదీ మధ్య ద్వైపాక్షిక హజ్ ఒప్పందం

భారత్-సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక హజ్ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2026 సంవత్సరానికి భారత్ కోటాలో 1,75,025 మంది యాత్రికులకు సౌదీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, సౌదీ మంత్రి తౌఫిక్ బిన్ మధ్య సంతకాలు జరిగాయి. వీరిలో భారత హజ్ కమిటీ ద్వారా 1,40,020 మంది, హజ్ గ్రూప్ ఆపరేటర్ల ద్వారా 35,005 మంది యాత్రకులు సౌదీ వెళ్లనున్నట్లు సమాచారం.