మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
AP: దేశంలో తేనె ఎగుమతులపై మాజీ MP విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద తేనె ఎగుమతిదారుగా అవతరించిందన్నారు. 2020లో దేశం ఈ రంగంలో తొమ్మిదవ స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇది రైతులకు, పారిశ్రామికవేత్తలకు గొప్ప విజయం అని కొనియాడారు. కాగా ఈ రంగంలో యువ రైతులు, మహిళలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.