గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు
VZM: కోరుకొండ రైల్వే స్టేషన్ జొన్నవలస రైల్వేగేట్ పట్టాల మధ్య గుర్తు తెలియని మృతదేహం గుర్తించినట్లు హెచ్.సీ.ఎం.ఎస్.ప్రసాద్ బుధవారం తెలిపారు. సుమారు 5 అడుగుల 2 అంగుళాల పొడవు ఉండి, చామనచాయ రంగులో ఉన్నట్లు చెప్పారు. నీలం రంగు రౌండ్ నెక్ టీ షర్ట్, నిక్కర్, మృతదేహం పక్కన తెలుపు, ఎరుపు టవలు ఉన్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9440170317ను సంప్రదించాలని అధికారులు సూచించారు.