చెన్నూర్‌లో సర్పంచ్ స్థానాలకు గాను 264 నామినేషన్‌లు
MNCL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చెన్నూర్ నియోజకవర్గంలో 3వ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 102 సర్పంచ్ స్థానాలకు గాను 264 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. 868 వార్డు స్థానాలకు 584 నామినేషన్లు నమోదయ్యాయి. అభ్యర్థుల కోసం కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు