ఇంద్రకీలాద్రిపై ఆదిశంకరాచార్యుల నగరోత్సవం
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆదిశంకరాచార్య జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం అభిషేకాల అనంతరం సాయంత్రం నగరోత్సవం భక్తుల మధ్య ఘనంగా సాగింది. చిన్నారులు శంకరాచార్య వేషధారణలో ఆకట్టుకున్నారు. కోలాటాలు, నృత్యాలు, భజనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. వేలాది భక్తులు పాల్గొన్నారు.