షాప్‌కు నిప్పు.. రూమర్స్‌ను నమ్మవద్దు: SP

KMR: సదాశివనగర్‌లో చిన్న ప్రభు లింగం నివాసంలో నిర్మిస్తున్న గోల్డ్ షాప్ షెడ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం నిప్పంటించి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్ చంద్రం మాట్లాడుతూ.. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై వచ్చే ఫేక్ న్యూస్‌లు నమ్మవద్దన్నారు.