వాలీబాల్ పోటీలకు పత్తికొండ విద్యార్థి ఎంపిక
KRNL: పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న యం. విగ్నేష్ సౌత్ జోన్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు వాలీబాల్ అసోసియేషన్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు కాకినాడ విశ్వవిద్యాలయంలో జరిగే వాలీబాల్ పోటీలలో విగ్నేష్ రాయలసీమ జట్టు తరుపున పాల్గొంటారు. విగ్నేష్ను ప్రిన్సిపల్ మాధురి, ఫిజికల్ డైరెక్టర్ రామాంజనేయులు అభినందించారు.