VIDEO: వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే రాము సోమవారం పర్యటించారు. మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో కట్టవాని చెరువు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన పశు వైద్య శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. శిబిరంలో అందిస్తున్న చికిత్సల వివరాలను వెటర్నరీ వైద్యులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. ఈ సందర్భంగా పాడి రైతులకు ఎమ్మెల్యే మందులను పంపిణీ చేశారు.