అదుపుతప్పి లారీ బోల్తా!

NRPT: పట్టణ శివారు దామరగిద్ద రోడ్డులో శనివారం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు వివరాలు. దామరగిద్ద నుంచి నారాయణపేట దిక్కు వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడిందని చెప్పారు. లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు చెప్పారు. ఘటన స్థలానికి పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.