రక్తదానం ప్రాణదానంతో సమానం

రక్తదానం ప్రాణదానంతో సమానం

KMR: సదాశివనగర్ మండలం ఆడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మోసర్ల శ్రీకాంత్ రెడ్డి మంగళవారం అత్యవసర పరిస్థితుల్లో ఒక మహిళకు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. దానాలన్నింటిలోకెల్లా రక్తదానం గొప్పదని అన్నారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరి జీవితానికి వెలుగు నింపవచ్చని తెలిపారు. ప్రమాదాల్లో సకాలంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన గుర్తు చేశారు.