గోలివాడ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
PDPL: అంతర్గాం మండలం గోలివాడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం శనివారం నిర్వహించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలపై పార్టీ శ్రేణులు అవగాహన కల్పించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.