VIDEO: చిన్నారులకు ఉచిత సామూహిక సున్తీ కార్యక్రమం

VIDEO: చిన్నారులకు ఉచిత సామూహిక సున్తీ కార్యక్రమం

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని పామూరు రోడ్డులో ఉన్న ఉర్దూ పాఠశాల ఆవరణలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక సున్తీ(ఒడుగు) కార్యక్రమం జరిగింది. పట్టణం నుంచే కాక నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు తమ చిన్నారులతో వచ్చి సున్తీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యులు చిన్నారులకు సున్తీ ఆపరేషన్ చేసి, మందులు పంపిణీ చేశారు.